TELUGU:
"తన పేరు Deepak. తనంటే నాకు చాలా ఇష్టం. అంత కన్న ఎక్కువ ప్రేమ. ఇప్పటి వరకు నా జీవితంలో నాకంటూ మిగిలిన జ్ఞాపకాల్లో ఒక్కటైనా వాడులేకుండా లేదు అంటే నువ్వు నమ్ముతావా! ఎక్కడ పుట్టాడో ఎప్పుడు పుట్టాడో తెలీదు కానీ వాడు నా life లోకి వచ్చాక మాత్రం నాకోసమే పుట్టాడు అనిపించింది.
తన చుట్టూ ఎంత మంది ఉన్న నాకోసం వెతుకెవాడు. నాతో నే ఉండేవాడు. నేను అడగకుండానే నాకోసం ఎంతో ప్రేమగా అన్ని చేసి పెట్టేవాడు.
School లో holidays అని చెప్పినప్పుడు అందరు చాలా హ్యాపీగా feel అయ్యేవారు.ఒక్క మా ఇద్దరం తప్ప. ఎందుకంటే ప్రతి holidays లో Deepak వాళ్ళ తాత గారి ఇంటికి వెళ్లేవాడు. వాడు దూరంగా వున్నన్ని రోజులు ఎంత బాధగా ఉన్న, వాడిని మళ్ళీ చూడగానే ఆ బాధ నంత మర్చిపోయే వాడ్ని. ఆ రోజులు మళ్ళీ మళ్ళీ రాకూడదని రోజు దేవుణ్ణి ప్రార్దించే వాడ్ని.
ఈ సారి కూడా ఎప్పటిలాగానే వాళ్ళ తాత గారింటికి వెళ్ళాడు. వారాలు, రోజులు, గంటలు లెక్కపెట్టుకొని మరి ఎదురు చూసా! School start అయ్యిపోయిన ఇంకా వాడు ఎందుకు రాలేదో అర్ధం కాలేదు. Class కి రాగానే నా కళ్ళు వాడికోసమే వెతికేవి, నా మనసు వాడు కూర్చునే చోటుకే వెళ్ళేది. వాడి bench లో కూర్చుని వాడికి చెప్పాలనుకున్న మాటలన్నీ ఒక book లో రాసుకునే వాడ్ని.
ఆ రోజు నువ్వు చదివిన కవిత రాసింది, మొన్న నిన్ను road మీదే వదిలేసి పరుగుతీసింది, ప్రాణం పోతుందేమో అనెంతగా ప్రయత్నించింది వాడికోసమే.
ఏమి చెయ్యలేని నా నిస్సహాయతకు నాకె సిగ్గేసి, ఏమైందో ఎలా అయినా తెలుసుకోవాలని school office room కి వెళ్లి అడిగాను. నేను తనని road మీద చుసిన రోజే TC తీసుకొని వెళ్లిపోయడని చెప్పారు.
రోజు school కి వెళ్లే ముందు వాడు వచ్చాడేమో అని వాళ్ళ ఇంటికెళ్లి చూస్తాను, school అయ్యిపోయాక తను కనిపిస్తాడేమో అని అదే road మీదకెల్లి నించుంటాను.
ఆలా ఎంత సేపు నించున్న ఆలా ఎన్ని సార్లు వెళ్లి చుసిన వాడు రాడు వాడు అక్కడ ఉండడు అనే నిజం వాడి కోసమే ఎదురుచూస్తున్నా నా మనసుకి ఎలా చెప్పాలి.
తను నా పక్కన లేకుండా బతికేస్తున్నాను అనే ఆలోచనే నాకు నచ్చడం లేదు. ఇంకా నిద్ర ఎలా పడుతుంది తినే తిండి లోపలికి ఎలా వెళ్తుంది.
వాడు మళ్ళీ కనిపించే సరికి నా ఆనందం మళ్ళీ తనతో పాటు తెచ్చేసాడనుకున్న, వున్న ఆనందాన్ని దాన్ని దాచేస్తున్న నా ఆశలని వాడితోనే పట్టుకొని వెళ్ళిపోతాడని అనుకోలేదు.
తను నాకు కావలి. మళ్ళీ ఎప్పటిలా తను నాతో మాట్లాడాలి. తనతో పాటు School కి వెళ్ళాలి. ఆడుకోవాలి. నా జీవితంలోనుంచి వాడు తీసుకు వెళ్ళిపోయినా నా ఆనందాన్ని మళ్ళీ వాడే తీసుకురావాలి" అంటూ మోకాళ్ల మీద కూర్చొని నా మనసులోనీ కష్టం బయటకు వచ్చేలా నా Deepak మీద నాకున్న ప్రేమ తనకు తెలిసేలా నాలో నేను కుమిలిపోతూ తనకు నా బాధ చెప్పుకున్నాను.
తన కళ్ళలో నీళ్లు రావడం నేను చూసాను. కానీ నాకు దైర్యం చెప్పాలని, తన బాధని తన కళ్ళ దగ్గరే ఆపేసింది. నా దగ్గరకు వచ్చి నా భుజం మీద చేతులు వేసి నా గుండెకు తన గుండె చప్పుడు తెలిసేలా, తను తీసుకుంటున్న శ్వాస నా చెవులలో ప్రతిధ్వనించేలా, రెండు తనువులకు ఒకటే ప్రాణం అనిపించేలా నన్ను తన మనసుకి హత్తుకుంది. నా వీపు మీద నిమురుతూ నాకు తను వుంది అంటూ దైర్యం చెప్పింది.
తనని అలానే పట్టుకొని ఎంత సేపు ఏడ్చానో నాకే తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం లోకమంత తిరిగి అలసట తో వచ్చిన గువ్వకి గూటిలో ఉన్న తన అమ్మ ఒడిలో పడుకున్నప్పుడు ఎంత ఉపశమనం కలుగుతుందో తన కౌగిలిలో ఓదిగిపోయిన నాకు, అంతే ఉపశమనం కలిగిందని చెప్పడం చాలా తక్కువే అవుతుంది.
ఒక్క సారిగా నా జీవితంలోనీ కష్టాలన్నీ తమకు తాముగా వెనక్కి వెళ్లిపోతున్నట్టుగా, నేను చుసిన సంతోషాలన్ని ఆ ఒక్క క్షణం ముందు, చిన్న బోతునట్టుగా అనిపించింది. తను ముందుగా చెప్పినట్టు గానే నాకు ఒంటరి తనానికి మధ్య చాలా దూరం పెంచేసింది.....
(to be continued next Tuesday....)
(to be continued next Tuesday....)
ENGLISH:
"Deepak is his name. The one who I like and love more than anything in this world. I don’t know whether you could believe it or not, but throughout my life, there is not even a single memory I could able to make in his absence. I don't know when and where he was born, but the day he came into my life, I felt that he was born for me, to fill my life with heavenly delight.
He is the one who searches for me, even in the immense crowd. He is the one who always loves to be my companion and he is the one who fulfills all my needs without even being asked for.
When the vacation was announced in the school, it seemed to be very happy and excited for everyone except for Deepak and me. Because in every vacation Deepak used to go to his grandfather’s house. All those days would be so salty for me. But the day when he returns back, I would forget all the pain that I suffered so long. I pray each day to not let those days to get repeated in my life.
This time, like always, he went to his grandfather's house. I waited for him counting days after days.
I felt so absurd when the School was started, yet he did not come to see me. All my dreams with him went in vain. When I reach the classroom door, my eyes always search for him. My heart hoped for his existence in the class. I wrote in my book, all my feelings that I wanted to share with him. I couldn’t find more ways to reduce my pain.
The poem you read that day, the hasty run I took by leaving you on that road, the struggle I took at the cost of my life, all those are the holy deeds I took in reaching him.
With all my ridiculous helplessness that I could not find anything about him, I went to the school office room to find the reason for his absence. I came to know that he left the school by taking his TC on the same day, I see him on the road.
Every day while going to school, I used to stare at his house and in the evening, I used to stand on the road, in the hope to see him.
But how could I able to say it to my heart that the person, it is searching for and the one it is waiting for will not be back again.
If I was not able to digest his absence in my life, then how could I even eat and sleep happily? The moment I saw him again, I felt that all my happiness would come back to me. But I couldn’t expect that he would take all my little hope along with him. But still, I want him, I want to go to school with him, I want to play with him and I want him to bring back all my happiness that he had taken out of my life, himself."
I said with her with a bleeding heart. I sat down on my knees; tears started rolling from my eyes. I confessed her all my pain with a discontented heart. I could sense her tears too, but she concealed all her grief in an aspiration to let me hold my courage.
She came to me, put her hands on my shoulders, and wrapped her hands around me just like a mother soothing her child’s pain.
I don’t know how many hours had passed away looking into her deep merciful eyes.
At that moment, I felt as if all my blissful days have started moving away from me, all my griefs could lose their identity before the relief I was getting at that moment.
(to be continued next Tuesday....)
HINDI(TRANSLATION):
उसका नाम DEEPAK है। मै उसे बोहुत पसंद करता हूँ। इतना प्यार। क्या आप मानते हैं कि मैंने अपने जीवन में अब तक किसी भी अन्य यादों का उपयोग नहीं किया है! मुझे नहीं पता कि वह कहां और कब पैदा हुआ था लेकिन वह मेरे जीवन में आया और मेरे लिए पैदा हुआ।
मेरे लिए देख रहे हैं कि उसके आसपास कितने लोग हैं। वह मेरे साथ था। वह बिना पूछे मेरे लिए बहुत प्यारा इंसान है।
जब आप स्कूल में छुट्टियां कहते हैं, तो हर कोई बहुत खुश महसूस करेगा। हमारे दो को छोड़कर। क्योंकि डीपैक के दादा हर छुट्टी पर घर जाते थे। वह कितने दिनों से दूर है, वह दर्द जो वह फिर से देखता है और इसके बारे में भूल जाता है। दिन भगवान से प्रार्थना कर रहा है कि वह दिन फिर न आए।
इस बार, हमेशा की तरह, उनके दादा घर गए थे। सप्ताह, दिनों और घंटों की गणना करें और आगे देखें! स्कूल शुरू अभी तक समझ में नहीं आया है कि क्यों। जब मैं कक्षा में गया, तो मेरी आँखें कुछ उपयोग करने के लिए देख रही थीं। वह सभी शब्द जो वह एक बेंच पर बैठकर एक किताब में लिखना चाहता है।
उस दिन आपने जो कविता पढ़ी थी, आखिरी बार आपने उसे सड़क पर छोड़ दिया था, बस जीवन को पाने की कोशिश कर रहा था।
अपनी लाचारी के लिए मुझे कुछ नहीं मिला और मैं स्कूल ऑफिस के कमरे में गया कि कैसे पता लगाऊं। मैं उसे सड़क पर टीसी के पास ले गया और उसे छोड़ने के लिए कहा।
स्कूल जाने से एक दिन पहले, मैं देखूंगा कि क्या वे स्कूल आते हैं, और स्कूल के बाद, मैं उसी सड़क पर रहूंगा। मुझे अपने मन से कितनी बार कहना है कि जो व्यक्ति लंबे समय तक सच का इंतजार कर रहा है।
मुझे यह विचार पसंद नहीं है कि वह मेरे बिना रहता है। कैसे सोना है और कैसे खाना है और कैसे अंदर जाना है। जब वह फिर से प्रकट होता है, तो मुझे नहीं लगता कि मेरे पास फिर से अपनी खुशी लाने की मेरी आशाएं, जो खुशी उसके पास है, उसे छिपाकर उसके पास चली जाएगी।
वह मुझे चाहता है। उसे मुझसे बार-बार बात करनी चाहिए। उसके साथ स्कूल जा रही थी। खेल। मैंने उसे अपने जीवन से निकाल दिया और अपने आनन्द को फिर से लाना चाहता था। अपने घुटनों पर बैठकर अपनी कठोरता को मेरे दिमाग से बाहर निकाल दिया। मैंने उसकी आँखों में पानी आते देखा। लेकिन उसे मुझे हिम्मत बतानी पड़ी और अपनी आँखों से अपना दर्द रोकना पड़ा।
वह मेरे पास आया और अपने हाथ मेरे कंधे पर रख दिए और मुझे लगा कि उसका दिल मेरे लिए धड़क रहा है, जो साँस वह मेरे कानों में ले रहा था, और मुझे लगा जैसे दो जिंदगियाँ एक जैसी थीं। मुझे मेरी पीठ पर हिम्मत ने कहा कि वह था।
मुझे नहीं पता कि वह कब तक रोती और रोती रही। लेकिन एक बात सच है, मैं बहुत राहत महसूस करता हूं जब मेरी मां उस गुफा की गोद में लेटी हुई है जो दुनिया के अंत में वापस आ गई है।
मैं जो खुशियाँ महसूस कर रहा था, वह उस पल से पहले थोड़ी नीरस हो गई थी, क्योंकि मेरे जीवन की सारी कठिनाइयाँ अपने आप वापस आ गईं। जैसा कि मैंने पहले कहा, मैंने एक अकेले बच्चे के बीच की दूरी बढ़ा दी है ....।
(to be continued next Tuesday....)
(to be continued next Tuesday....)